లక్షణాలున్నాయ్.. కరోనా వచ్చే చాన్స్ అంటూ అనసూయ పోస్ట్

Anasuya Bharadwaj may tests Corona virus positive

ప్రస్తుతం సినీ తారలందరూ యమా బిజీగా ఉన్నారు. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వెళ్తున్నారు..స్పెషల్ ఈవెంట్లలోనూ పాల్గొంటున్నారు.. వందల మంది ఉండగానే షూటింగ్‌లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏ కొంచెం ఏమరపాటుగా ఉన్నా కరోనా అటాక్ చేసే చాన్స్ ఉంది. ఈ మధ్య మళ్లీ వరుసగా సెలెబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. షూటింగ్ సెట్‌లో యూనిట్ సభ్యులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే.

Anasuya Bharadwaj may tests Corona virus positive

తాజాగా అనసూయ ఓ షాకింగ్ పోస్ట్ చేసింది. కరోనా లక్షణాలు కనబడుతున్నాయి.. పాజిటివ్ వచ్చే చాన్స్ ఉందేమో అనేట్టుగా చెప్పుకొచ్చింది. దీంతో అందరి గుండెల్లో గుబులు మొదలైంది. అసలే అనసూయ అంటే ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. నిన్ననే మళ్లీ నిహారిక, చైతన్య అంటూ తన కొత్త వెబ్ సిరీస్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. టీవీ షోల షూటింగ్‌లోనూ పాల్గొంది. ఇంతకీ అనసూయ చేసిన పోస్ట్‌లో ఏముందంటే..

Anasuya Bharadwaj may tests Corona virus positive

ఓ ఈవెంట్‌ కోసం కర్నూలు వెళ్లేందుకు ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచాను. అప్పుడే నాకు కరోనా లక్షణాలు ఉన్నాయని గ్రహించాను. దీంతో ప్రయాణాన్ని ఆపుకున్నాను. వెంటనే నేను టెస్ట్ చేయించుకుంటా. అలాగే, ఇటీవలి కాలంలో నాతో ఉన్న వాళ్లకూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పరీక్ష చేయించుకోండి.. నాకు సంబంధించిన రిపోర్ట్‌ను మీకు తెలియజేస్తుంటాను.. అందరూ జాగ్రత్తగా ఉండండి అని కోరుకుంది.