దుబాయ్ శీను సినిమాలో షియాజీ షిండే మొహంపై ముడుతలు రాకుండా వెరైటీ వ్యాయామం చేస్తుంటాడు. ఆ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే అలాంటి ఓ వెరైటీనే అనసూయ కూడా పాటిస్తోన్నట్టు కనిపిస్తోంది. అసలే అనసూయ అంటేనే అందం.. అందం అంటేనే అనసూయ. అలాంటి అనసూయ తన అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తుందా? అని అందరూ ఆలోచిస్తారు.. తెలుసుకోవాలని తాపత్రయపడుతుంటారు.
అలాంటి వారి కోసమే అన్నట్టు తాజాగా అనసూయ ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తన అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తుందో చెప్పేసింది. మామూలుగా సెలెబ్రిటీలందరూ యోగాలు, వ్యాయామాలు చేస్తుంటారు. అది కామన్. ఎందుకంటే వారు తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటేనే వారికి చాన్స్‌లు వస్తుంటాయి. పాత్రలకు తగ్గట్టు మారుతూ ఉంటూనే క్రేజ్ ఫాలోయింగ్ కూడా పెరుగుతూ ఉంటుంది.
అనసూయ కూడా అంతే. తన అందాన్ని కాపాడుకోవడానికి, పైగా మొహంలో ఆ కాంతి తగ్గకుండా ఉండేందుకు ఫేషియల్ యోగా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. అల్రెడీ అది మొదలెట్టి మూడు రోజులు అవుతోందని చెప్పింది. మొత్తానికి అనసూయ అందం వెనుకున్న రహస్యం అదన్నమాట. ప్రస్తుతం అనసూయ సినిమాలతోనూ బిజీ అవుతోంది. ఇటు బుల్లితెర, అటు వెండితెరను కవర్ చేయాలంటే ఆ మాత్రం అందాన్ని మెయింటైన్ చేయాలి.