సిల్క్ స్మిత బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన అనసూయ

Anasuya Bharadwaj Acts in Silk SMitha Biography

టాలీవుడ్ ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలకు కూడా భారీ స్థాయిలో క్రేజ్ అందుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమా తారలకు సంబంధించిన కథలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. మహానటి సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక చాలా రోజుల తరువాత సిల్క్ స్మితకు సంబంధించిన బయోపిక్ పై ఒక స్పెషల్ న్యూస్ వైరల్ గా మారింది. అందులో యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి.

ఇక రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేయగానే సిల్క్ స్మిత బయోపిక్ కు సంబందించినదే అంటూ మరికొన్ని కథనాలు కూడా వచ్చాయి. నిజానికి అది సిల్క్ స్మితకు సంబంధించినది కాదు. తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఒక ప్రయోగాత్మక సినిమాలోని స్టిల్ కు సంబంధించినది. ఇక ఫైనల్ గా ఆ విషయంపై అనసూయ అఫిషియల్ గా ఒక క్లారిటీ ఇచ్చింది. “నేను సిల్క్ స్మిత గారి బయోపిక్ లో నటించడం లేదు” అంటూ సింగిల్ ట్వీట్ తో కుండబద్దలు కొట్టేసింది.

గత కొన్నిరోజులుగా వస్తున్న రూమర్స్ కు ఒక్క మాటతో కౌంటర్ ఇచ్చిన అనసూయ కేవలం సిల్క్ స్మిత అనే బయోపిక్ లోనే కాకుండా వేరే బయోపిక్స్ లలో కూడా నటించడం లేదని ఫైనల్ గా ఒక క్లారిటీ ఇచ్చేసింది. ఇక ప్రస్తుతం ఒక తమిళ సినిమాతో పాటు ఆచార్య, కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో కూడా స్పెషల్ పాత్రలో కనిపించనుంది. అలాగే కథానాయికగా పలు లేడి ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.