యాంకర్ అనసూయ ఈ మధ్య ఎక్కువగా వర్కవుట్ల మీద ధ్యాస మళ్లీంచింది. అసలు అనసూయ వర్కవుట్లు చేస్తున్నట్టుగా ఎక్కడా ఇన్ని రోజులు కనిపించలేదు. కానీ గత కొన్ని రోజులుగా మాత్రం అనసూయ వర్కవుట్లతోనే బిజీగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫేస్ ఎక్సర్‌సైజ్‌లు అంటూ వెరైటీ వ్యాయామాలు చేస్తున్నట్టుంది. అసలే అనసూయ ఇప్పుడు కరోనా నుంచి కోలుకుంది. క్వారంటైన్‌లో కాస్త లావు ఎక్కువయ్యానని ఏమైనా అనిపించిందో ఏమో గానీ మరింతగా వర్కవుట్టు చేస్తున్నట్టుంది.
అనసూయ రెండు వారాల క్రితం ఓ పోస్ట్ చేసింది. కరోనా లక్షణాలు ఉన్నట్టున్నాయ్.. పాజిటివ్ వచ్చే అవకాశమే ఉందని అనసూయ చెప్పుకొచ్చింది. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని అనసూయ కోరుకుంది. అయితే తరువాత మాత్రం అనసూయ ఎక్కడా కూడా తనకు పాజిటివ్ వచ్చిందని చెప్పలేదు. కానీ మొన్న తన అభిమానులతో ముచ్చట్లుపెట్టినప్పుడు మాత్రం కోవిడ్ పాజిటివ్ వచ్చిందని చెప్పింది.
అలా ఇప్పుడు అనసూయ క్వారంటైన్ పూర్తి చేసుకుంది. నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. మళ్లీ జబర్దస్త్ స్టేజ్ మీద వయ్యారాలను ఒలకబోస్తోంది. అలా అనసూయ క్వారంటైన్‌లో ఉన్న సమయంలో కాస్త చబ్బీగా తయారయ్యానని ఫీలైందో ఏమో గానీ వర్కవుట్లతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా అనసూయ వర్కవుట్లు చేసి వచ్చినట్టుంది. ఇందులో అనసూయ బాగా అలిసిపోయినట్టు కనిపిస్తోంది. రిలాక్స్ ప్లస్ రీచార్జ్, వర్కవుట్ ఆఫ్టర్ లైక్ ఎటర్నిటీ అంటూ వెరైటీ వెైరైటీ క్యాప్షన్స్ కూడా పెట్టేసింది. మొత్తానికి అనసూయ వితవుట్ మేకప్‌లొనూ అదరగొట్టేస్తోంది.