సిల్క్ స్మితగా అనసూయ.. మరో సెన్సేషన్‌కు రెడీ.. లుక్ వైరల్

Anasuya Bharadwaj Acts in Silk SMitha Biography

బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా తెలుగు ప్రేక్షకుల అభిమానులన సంపాదించుకుంది అనసూయ. అయితే బుల్లితెరపై గ్లామర్‌ను ఒలకబోసే అనసూయ.. వెండితెరపై స్కిన్ షోకు ప్రాధాన్యత ఇవ్వదు. సిల్వర్ స్క్రిన్ మీద తన టాలెంట్‌ను చూపించేందుకు మాత్రమే ముందడుగు వేస్తుంది. అందుకే అనసూయకు ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఆచితూచి ఓకే చేస్తుంది. అలా సెలెక్టివ్‌గా ఉంటుంది కాబట్టే క్షణం, రంగస్థలం లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.

Anasuya Bharadwaj Acts in Silk SMitha Biography
Anasuya Bharadwaj Acts in Silk SMitha Biography

అయితే అనసూయ మళ్లీ ఓ ప్రయోగం చేసేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే.. కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ సినిమాలో, రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లో కీలక పాత్రలు పోషిస్తోంది. అలాగే ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే సినిమాలో ఏకంగా గర్భవతిగా నటిస్తూ అందర్నీ షాక్‌కు గురి చేసింది. అది కాకుండా సినిమా మొత్తం అలాగే ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు కూడా బాగానే వైరల్ అయ్యాయి.

మళ్లీ ఇప్పుడు ఓ సెన్సేషనల్ క్యారెక్టర్ పోషించేందుకు రెడీ అయింది. సిల్క్ స్మిత బయోగ్రఫీలో అనసూయ నటిస్తోంది. మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం ప్రారంభించాను అంటూ ఓ లుక్‌ను షేర్ చేసింది. అందులో సిల్క్ స్మితను ఆధారంగా చేసుకుని ఈ లుక్‌ను డిజైన్ చేశారు అని చెప్పుకొచ్చింది. అంటే మొత్తానికి మరో సారి సౌత్ మొత్తాన్ని తన అద్భుతమైన నటనతో అదరగొట్టేందుకు అనసూయ రెడీ అవుతోందని తెలుస్తోంది.