అనసూయ భరద్వాజ్‌కు కోవిడ్ పాజిటివ్ వచ్చిందన్న సంగతి కొందరికీ తెలుసు. ఒంట్లో నలతగా ఉందంటూ కరోనా పాజిటివ్ లక్షణాలు వచ్చే అవకాశం ఉందంటూ అనసూయ ఓపోస్ట్ చేసింది. ఆ తరువాత అనసూయ మళ్లీ సోషల్ మీడియాలో కనిపించలేదు. ఎక్కువగా యాక్టివ్‌గానూ లేదు. అయితే అనసూయకు కరోనా పాజిటివ్ వచ్చిందా? లేదా? అన్న అనుమానం కూడా ఎందరిలోనో మిగిలిపోయింది.
అయితే అనసూయ క్వారంటైన్‌కు పరిమితమైందన్న సంగతి ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికే తెలుస్తుంది. ఇంట్లోనూ ఉంటూ తీరిగ్గా పుస్తకాలు చదువుతూ ఉండే ఫోటోలను షేర్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మాత్రంఅనసూయకు కరోనా తగ్గినట్టు కనిపిస్తోంది. కరోనా నెగెటివ్ రావడంతో క్వారంటైన్ నుంచి బయటకు వచ్చినట్టుంది. తాజాగా అనసూయ తన అభిమానులతో ముచ్చట్లుపెట్టింది.
అందులో భాగంగా అనసూయ ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. గ్రీన్ టీ ఇష్టమా? బ్లాక్ టీ ఇష్టమా? అని అడిగితే కాఫీ అంటూ సమాధానం ఇచ్చింది. వాల్ పేపర్, పెళ్లి ఫోటో, ఈ ఏడాదిలో దిగిన ఫస్ట్ పిక్ ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు సంధించారు. అయితే ఓ నెటిజన్ మాత్రం వెరైటీ ప్రశ్నను అడిగాడు. చివరగా గతంలో మొదటి సారిగా చేసిన పని ఏంటని అడిగితే అనసూయ క్రేజీ రిప్లై ఇచ్చింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడం అదే మొదటి సారి అని చెప్పుకొచ్చింది.