బంగారపు కాఫీ కప్పు.. అనసూయ లెవెల్ మారిందా?

ఆ మధ్య అప్పుడెప్పుడో కొన్ని వార్తలు చదివాం. బంగారం ప్లేట్, బంగారం కుర్చీలు, బంగారు చొక్కాలు, బంగారంలో ఒళ్లంతా నింపుకోవడం వంటి చిత్రవిచిత్రమైన వార్తలు విన్నాం. అయితే అది బంగారంపై ఉన్న పిచ్చికి పరాకాష్టగా అది నిలుస్తుంటుంది.అయితే తాజాగా అనసూయ కూడా ఇదే పిచ్చిలో పడినట్టుంది. అయితే 24 కేరట్స్ అంటూ జనాలను పిచ్చోళ్లను చేస్తుందా? లేదా నిజంగానే అది బంగారమా? అని తెలియాల్సి ఉంది.

Anasuya Bharadwaj about gold coffee cup

తాజాగా అనసూయ ఓ పోస్ట్ చేసింది. ఇందులో కాఫీ తాగుతూ ఫుల్ చిల్ అవుతోంది. అయితే ఆ కాఫీ కప్పు చుట్టూ గోల్డ్ కోట్ వేసి ఉంది. పైగా అది 24 కారెట్స్ బంగారం అని చెప్పుకొచ్చింది. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. నిజంగానే అది బంగారమా? లేదా నెటిజన్లను బోల్తా కొట్టించేందుకు అలా చేస్తుందా? అని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అనసూయ అయితే ఇలా అందరినీ గందరగోళానికి గురి చేసింది.

అసలే అనసూయ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. కార్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుందన్ని సంగతి తెలిసిందే. ఊపిరి సలపనంత బిజీగా ఉండటం.. చేతి నిండా సంపాదిస్తుండటంతో అలా బంగారు కప్పులో కాఫీ తాగడం పెద్ద విశేషమేమీ కాదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అనసూయ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఐటం సాంగ్స్‌లు, బుల్లితెర షోలతో ఫుల్ బిజీగా ఉంది. సంపాదనలోనూ అనసూయ ఈ ఏడాది దూసుకుపోయేలా ఉంది.