నేను అలాంటి దాన్నే.. అనసూయ సెన్సేషనల్ కామెంట్స్

Anasuya ABout Social Media and Trolling

అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే అనసూయ విషయంలో అందరూ ఒకటే ఫిర్యాదు చేస్తారు. ఆమెను పొగిడితే బాగానే ఉంటుంది.. విమర్శిస్తే మాత్రం వెంటనే బ్లాక్ చేసేస్తుంది.. దానికి వివరణ ఇచ్చుకోదని అనసూయ గురించి నెటిజన్లు కామెంట్లు చేస్తుంటారు. విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొనే సెలెబ్రిటీల్లో అనసూయ టాప్ ప్లేస్‌లో ఉంటుంది.

Anasuya ABout Social Media and Trolling

తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ అనసూయ సోషల్ మీడియా, ట్రోలింగ్ గురించి చెప్పుకొచ్చింది. తాను సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటానని చెప్పుకొచ్చింది. దీనితో రకరకాల కామెంట్స్‌ వస్తూ ఉంటాయని, మొదట్లో ఈ కామెంట్స్‌ను చూస్తే విపరీతమైన కోపం వచ్చేదని తెలిపింది. వాస్తవానికి ఒకప్పుడు తాను చాలా ఇంపల్సివ్‌గా ఉండేదాన్నని.. మనసులో ఏమున్నా బయటకు చెప్పేసేదాన్నని పేర్కొంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ప్రెషర్‌ కుక్కర్‌లా ఉండేదాన్నని చెప్పుకొచ్చింది. దీని వల్ల కొన్నిసార్లు వివాదాల్లో చిక్కుకొనేదాన్నంటూ తన గురించి పేర్కొంది. కానీ క్రమేపీ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌కు స్పందించటం మానేశానని వెల్లడించింది. సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేసే ప్రతి వ్యక్తికి ఒకో అభిప్రాయం ఉంటుందని, వారి అభిప్రాయాలకు స్పందించటం మొదలుపెడితే మనకు ప్రశాంతత చెడుతుందని చెప్పుకొచ్చింది. మొత్తానికి ఇన్నాళ్లకు అనసూయకు తత్త్వం బోధపడినట్టుంది. కానీ అనసూయ మాత్రం తాను చేయాలనుకున్న పనే చేస్తుంది.