రష్మీ అలాంటిదా?.. అనసూయ ఏంటి అలా అనేసింది!!

Anasuya About Rashmi In Sreemukhi Show

యాంకర్ రష్మీ, అనసూయ మధ్య ఒకప్పుడు ఉన్న కోల్డ్ వార్ గురించి అందరికీ తెలిసిందే. అనసూయ తన వ్యక్తిగత కారణాల వల్ల జబర్దస్త్ షోను విడిచిపెట్టి వెళ్లింది. అలా అనసూయ వెళ్లడమే రష్మీ జీవితాన్ని మలుపు తిప్పింది. జబర్దస్త్ యాంకర్‌గా రష్మీ వెలుగులోకి వచ్చింది. మొదట్లో కాస్త తడబడినా కూడా నిలబడింది. తెలుగు అంతగా రాకపోయినా యాంకరింగ్‌లొ ఓనమాలు దిద్దుకుని ఇప్పుడు అనసూయకు ధీటుగా నిలబడింది.

Anasuya About Rashmi In Sreemukhi Show
Anasuya About Rashmi In Sreemukhi Show

అనసూయ, రష్మీల మధ్య గొడవ ఎందుకని జబర్దస్త్‌కి ఒకరు.. ఎక్స్ ట్రా జబర్దస్త్‌కి ఇంకొకరిని యాంకర్‌గా ఫిక్స్ చేశారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఉన్న కోల్డ్ వార్‌పై అప్పట్లో ఎన్నో స్కిట్లు వేశారు. కానీ రాను రాను ఈ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడింది. అనసూయ ఫ్యామిలీలో రష్మీ ఒకరుగా చేరింది. అనసూయ ఫ్యామిలీతో కలిసి రష్మీ కూడా అప్పుడప్పుడు వెకేషన్లకు వెళ్తుంటుంది. తాజాగా అనసూయ రష్మీ మనస్తత్వం గురించి ఓ కామెంట్ చేసింది.

శ్రీముఖి నిర్వహిస్తోన్న ఉమెనియా అనే టాక్ షోలో అనసూయ గెస్ట్‌గా వచ్చింది. అక్కడ రాపిడ్ ఫైర్ అంటూ శ్రీముఖి అనసూయను ఇరికించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ప్రదీప్ గురించి ఒక్క మాటలో చెప్పమంంటే.. వెడ్డింగ్ ప్లానర్ అని చెప్పింది. ఎందుకంటే ప్రదీప్ పెళ్లి చేసుకోవడం లేదని తెలిపింది. ఇక రష్మీ గురించి ఒక్క మాటలో చెప్పమంటే కౌన్సిలర్ అని కామెంట్ చేసింది. అంటే రష్మీ అందరికీ సూచనలు, సలహాలు ఇస్తుందని అలా చెప్పినట్టుంది.