శ్రీలీల స్టడీస్ పై ఆసక్తికర అప్డేట్..!

1124027-sree-leela

ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ ఫుల్ డిమాండ్ ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది యంగ్ సెన్సేషన్ శ్రీలీలే అని చెప్పాలి. కాగా శ్రీ లీల హీరోయిన్ గా ఇప్పుడు పదుల సంఖ్యలో సినిమాలు టాలీవుడ్ లో చేస్తూ ఫుల్ బిజీగా అయితే ఉంది.

కాగా ఈ చిత్రాల్లో ఇప్పుడు ఆల్ మోస్ట్ అన్నీ సెట్స్ మీద ఉండగా ఇప్పుడు టాలీవుడ్ లో శ్రీలీల మోస్ట్ బిజీ హీరోయిన్ గా అయితే నిలిచింది. ఐతే శ్రీలీల ఏజ్ లో చాలా చిన్న అమ్మాయి అని అందరికీ తెలిసిందే. కాగా ఓ పక్క తన చదువు చదువుకుంటూనే మరో పక్క సినిమాలు కూడా చేసేస్తుంది.

అప్పుడెప్పుడో ఏదో హీరో కూడా చెప్పాడు. ఓ పక్క షూటింగ్ చేస్తుంది మళ్ళీ మధ్యలో గ్యాప్ లో తన బుక్స్ తీసుకొని చదువుకుంటుంది అని అంత డెడికేషన్ ఉన్న ఈ యంగ్ హీరోయిన్ స్టడీస్ పై అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ సినీ వర్గాల్లో తెలుస్తుంది. కాగా ఈ అప్డేట్ తో అయితే శ్రీలీల మళ్ళీ గత ఏడాదిలో లానే ఈ ఏడాది ఎండింగ్ లో సినిమాలకి ఓ రెండు నెలల పాటు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ రేడు నెలల్లో తన ఎగ్జామ్స్ నిమిత్తం చదువుకోవాలని డిసైడ్ అయ్యిందట. దీనితో ఈ పరీక్షలు కంప్లీట్ అయ్యాక ఆమె తన డాక్టర్ పట్టా కూడా పొందుతుంది అని అందుకే ఈ రెండు నెలల్లో అయితే విరామం తీసుకోనుంది అని సినీ వర్గాలు చెప్తున్నాయి. కాగా ఇప్పుడు ఈమె నటించిన “స్కంద” చిత్రం సెప్టెంబర్ లో రిలీజ్ కి రాబోతుంది.