పూరి జగన్నాథ్ లావణ్య గొడవలపై శంకరన్న క్లారిటీ.. ఏమన్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకొని ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి నేడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ మరొక నటితో సాన్నిహిత్యంగా ఉండటం వల్ల తన భార్యకు విడాకులు ఇచ్చారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.అయితే ఈ వార్తలపై పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి కూడా క్లారిటీ ఇచ్చారు తన తల్లిదండ్రుల మధ్య ప్రేమ తప్ప విడాకుల ప్రస్తావన ఎప్పుడు రాలేదని వెల్లడించారు.

కానీ ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్ తన భార్య లావణ్యతో గొడవలు పడ్డారని అందుకే తన నుంచి దూరంగా ఉండి తనకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అంబర్ పేట శంకరన్న స్పందించారు.పూరి జగన్నాథ్ లావణ్య ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే వీరు పెళ్లిని ఇండస్ట్రీకి చెందిన పలువురు దగ్గరుండి జరిపించారు. ఇలా వీరి పెళ్లి జరిపించిన వారిలో అంబర పేట శంకర్ ఒకరు.ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈయన లావణ్య తనకు సమీప బంధువు అమ్మాయి అని తెలిపారు.

పూరి జగన్నాథ్ లావణ్య పెళ్లి చేసిన తర్వాత పూరి జగన్నాథ్ తనకు ఒక మంచి స్నేహితుడుగా మారిపోయారని ఇప్పటికి తరచూ తనకు ఫోన్లు చేయడం లేదా లావణ్యను పూరి జగన్నాథ్ ను కలవడం చేస్తుంటానని తెలిపారు.ఇలా ఎప్పుడు కలిసిన వీరిద్దరూ ఎంతో సంతోషంగా అన్యోన్యంగా కనిపించి మాట్లాడుతారు కానీ వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని వీరిద్దరూ విడిపోవడం లేదని తెలిపారు.పూరి జగన్నాథ్ సినిమాల పరంగా ముంబైలో ఉంటున్నారు కానీ లావణ్యకు పూరి జగన్నాథం మధ్య ఎలాంటి గొడవలు లేవని ఈ సందర్భంగా శంకరన్న క్లారిటీ ఇచ్చారు.