అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడో, ఎక్కడో తెలుసా!

అక్టోబర్ 31 దీపావళి సందర్భంగా థియేటర్స్ లో విడుదలైన అన్ని సినిమాలు సక్సెస్ కావడం విశేషం. ఒక్క భగీర సినిమా అటు ఇటుగా ఆడింది తప్పితే మిగిలిన అమరన్, లక్కీ భాస్కర్, క సినిమాలు మూడు సూపర్ హిట్ కావటం విశేషం. నవంబర్ 28న లక్కీ భాస్కర్ చిత్రాలు ఓటీటీ లోకి స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ఇక ఇప్పుడు అమరన్ మూవీ కూడా తన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసింది.

అమరన్ ఓటీటీ రైట్స్ భారీ డీల్ తో సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఆ సినిమాని డిసెంబర్ 5 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉంచుతుంది. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ పోస్టర్ వేసి మరి ప్రకటించారు నెట్ ఫ్లిక్స్ టీం.

పెద్ద స్క్రీన్ మీద మిస్ అయిన వాళ్ళు ఎప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూసిన వాళ్ళకి ఈ విషయం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అసాధారణమైన దర్శకత్వం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లే భావోద్వేగంతో కూడిన కథ, జీవి ప్రకాష్ సంగీతం అద్భుతమైన నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. మేజర్ ముకుంద వరదరాజన్ గా శివ కార్తికేయన్, ఆయన భార్య ఇందు గా సాయి పల్లవి నటన సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు.

రాజ్ కుమార్ పేరియ సామి దర్శకత్వం వహించిన ఈ సినిమా ని రాజ్ కమల్ ఫిల్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఇండియా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్ల దాకా వసూలు చేసి శివ కార్తికేయన్ సాయి పల్లవిలో కెరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్గా నిలిచింది. అమరన్ సినిమాని నెట్ఫ్లిక్స్ 60 కోట్ల రూపాయలకి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇక్కడ కాసుల వసూళ్లు రాబట్టడంలో ప్రభంజనం సృష్టిస్తుంది అని చెప్పటానికి సందేహించక్కర్లేదు.