టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి తర్వాత అంతటి స్థాయిలో గుర్తింపు పొందిన హీరోయిన్ ఎవరు అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు సౌందర్య. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సౌందర్య ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల సరసన నటించిన తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకొని ఇంట్లో మనిషిలా దగ్గర అయ్యింది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తెలుగు అమ్మాయిల కట్టు బొట్టు తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలలో నటించిన సౌందర్య హీరోయిన్ గా అగ్రస్థానంలో నిలిచింది. అయితే సౌందర్య మరణించడంతో ఇండస్ట్రీలో తీరనిలోటు మిగిలిపోయింది.
ఇదిలా ఉండగా హీరోయిన్ సౌందర్య ఆమని మధ్య మంచి స్నేహబంధం ఉంది. వీరిద్దరూ కూడా ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఇక ఆమని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రధాన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా సీరియల్స్ లో నటించడమే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో జడ్జిగా కూడా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు తన స్నేహితురాలు సౌందర్య గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలో ఆమని మాట్లాడుతూ.. సౌందర్య తనకి మంచి స్నేహితురాలని చెప్పుకొచ్చింది.
సౌందర్య మరణ వార్త వినగానే చాలా షాక్ అయ్యాను. ఆమె మరణించే సమయానికి నాకు పెళ్లి జరిగి ఏడాది అయ్యింది. సౌందర్యని తీసుకెళ్లే బదులు జీవితంలో అన్ని చూసిన నన్ను ఆ దేవుడు తీసుకెళ్ళి ఉంటే బాగుండని ఎంతో బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. సౌందర్య మరణించిన సమయంలో ఆమె గర్భవతి అని వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు అంటూ ఆమని చెప్పుకొచ్చింది. సౌందర్య తన అన్నని పెళ్లి చేసుకోమని నన్ను కోరింది. సౌందర్య అడిగినట్లు తన అన్నని పెళ్లి చేసుకుని ఉంటే ఆరోజు నేను కూడా తనతో పాటు వెళ్లేదాన్ని అంటూ ఆమని సమాధానం చెప్పారు.