చనిపోయేముందు ఏఎన్ఆర్ అమలతో ఇలాంటి మాటలు చెప్పారా.. పెద్ద రహస్యాన్ని దాచారుగా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో అద్భుతమైన ప్రేమ కథ చిత్రాలు కుటుంబ కథా చిత్రాలలో నటించి విశేష ప్రేక్షకు ఆదరణ పొందారు.సినిమాపై మక్కువతో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు చివరి రోజుల వరకు ఈయన సినిమాలలోనే నటిస్తూ సినిమాలతోనే తుదిశ్వాస విడిచారు.అయితే నాగేశ్వరరావు చివరిగా నటించిన చిత్రం మనం ఆయన ఆరోగ్యం సహకరించకపోయినా ఈ సినిమాకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.

అక్కినేని కుటుంబంలో మనం సినిమా ఎప్పటికీ మర్చిపోలేని తీపి జ్ఞాపకం అని చెప్పాలి. ఈ సినిమాలో అక్కినేని కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ నటించారు.ఇదిలా ఉండగా అక్కినేని నాగేశ్వరరావు గారు క్యాన్సర్ బారిన పడి చనిపోయిన విషయం మనకు తెలిసిందే అయితే ఆయన చనిపోయే ముందు అమలకు కొన్ని మాటలు చెప్పారట తాజాగా ఓ సందర్భంలో అమలా మాట్లాడుతూ చనిపోయే ముందు తన మామయ్య గారు చెప్పిన మాటలను బయటపెట్టారు.

ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ తనకేం కాదని మీరంతా ధైర్యంగా ఉండాలని చెప్పారట.ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరి ప్రేమ ఆశీర్వాదం వల్లే నేను ఇలాంటి అద్భుతమైన జీవితాన్ని గడిపాను. ఇలా ఇంతమంది ప్రేమ ఆప్యాయతలను అందుకొని ఎంతో అద్భుతమైన జీవితాన్ని గడిపాను.ఇలా ఓ గొప్ప నటుడుగా పుట్టడం ఎన్నో జన్మల పుణ్యఫలం అంటూ నాగేశ్వరరావు తన చివరి రోజులలో అమలతో ఇలాంటి మాటలు మాట్లాడారని తన కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారని ఈ సందర్భంగా అమల ఈ నిజాన్ని బయట పెట్టారు. ప్రస్తుతం అమల చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.