అమ్మో అల్లు అర్హ అల్లరి చూశారా?.. ఇళ్లంతా అలా పాడుచేస్తోంది!!

అల్లు వారి చిచ్చర పిడుగుల అల్లరి గురించి సోషల్ మీడియాలో అందరికీ తెలిసిందే. అయాన్, అర్హల అల్లరిని అల్లు స్నేహా రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ చిట్టి సోదరీసోదర మణుల బంధాన్ని ప్రత్యేకంగా చెబుతూ ఉంటుంది. లాక్ డౌన్‌లో అల్లు పిల్లలు చేసిన అల్లరి మాముల్ది కాదు. అన్నాచెల్లిళ్లు కలిసి ఇంట్లో చేసిన అల్లరి గురించి ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

Allu Sneha shares Allu Arha Cute Pic
Allu Sneha shares Allu Arha Cute Pic

బుగ్గల అర్హ, అయాన్‌లు బుల్లి స్కూటర్ ఎక్కి ఇళ్లంతా రచ్చ రచ్చ చేశారు. బాబాయ్ అల్లు శిరీష్ నేతృత్వంలో డ్యాన్సులు నేర్చుకున్నారు. క్యూట్ క్యూట్ స్టెప్పులు వేస్తుూ.. రచ్చ రచ్చ చేశారు. ఇక బన్నీతో బాగానే దాగుడు మూతలు ఆడుకున్నారు. అర్హకు, ఆమె ముద్దు ముద్దు మాటలకు సోషల్ మీడియాలో సపరేట్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక అయాన్ చేసే అల్లరి వేరే రేంజ్‌లో ఉంటుంది. ఆ మధ్య వైద్య సిబ్బంధి కోసం వీధుల్లోకి వచ్చి దీపాలన, చప్పట్లను కొట్టినప్పుడు అయాన్ చేసే రచ్చ తెగ వైరల్ అయింది.

Allu Sneha shares Allu Arha Cute Pic
Allu Sneha shares Allu Arha Cute Pic

తాజాగా అర్హ.. అల్లు రామలింగయ్య జయంతి వేడుకల్లో రచ్చ చేసింది. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం అల్లు స్నేహా అర్హ చేసే పిచ్చి పనులను షేర్ చేసింది. రంగులతో ఇంటి నేలను నింపేసింది. ఇలా ఇళ్లంతా రంగులు పూయడంలో అర్హ బిజీగా ఉండటంతో అల్లు స్నేహా తన కెమెరాలో బంధించేసింది. మొత్తానికి అల్లు పిల్లలు మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారు.