Allu Sneha Reddy: మొదటిసారిగా అల్లు అర్జున్ కు ఇష్టమైన వాటి గురించి బయటపెట్టిన స్నేహ రెడ్డి?

Allu Sneha Reddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అందరికీ సుపరిచితమే.ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు తన పిల్లలకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే అల్లు స్నేహ రెడ్డికి హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ ఉంది.ఇక ఈ మధ్య కాలంలో అల్లు స్నేహ అల్లు అర్జున్ కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడంతో ఈమెకు క్రమక్రమంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది.

ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ హీరో భార్యకి లేని క్రేజ్ అల్లు స్నేహకు మాత్రమే ఉందని చెప్పాలి.ఇన్ని రోజులు సోషల్ మీడియా వేదికగా వారి కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకున్న స్నేహరెడ్డి మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఈ క్రమంలోనే ఆస్క్ మీ ఎనీ థింగ్ అంటూ పెట్టేసింది. ఇక మొదటి సారిగా అల్లుస్నేహ రెడ్డి ఇలా అభిమానులతో చిట్ చాట్ చేయడంతో అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈమె పై ప్రశ్నల వర్షం కురిపించారు.

అయితే అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినప్పటికీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మాత్రం వెల్లడించారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కి ఏ ఫుడ్ అంటే ఇష్టం తనకు ఏ రంగు అంటే ఇష్టం అనే విషయాల గురించి స్నేహ తెలిపారు. తనకు రెడ్ కలర్ అంటే ఎంతో ఇష్టమని అలాగే ఇష్టమైన ప్రదేశం లండన్ అని స్నేహ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇకపోతే అల్లు అర్జున్ కి ఇష్టమైన ఫుడ్ బిర్యాని అని స్నేహ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.మొత్తానికి అల్లు అర్జున్ గురించి స్నేహ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.