అల్లు స్నేహా రెడ్డిలో ఈ యాంగిల్ కూడానా.. హాట్ డ్రెస్‌లో బర్త్ డే వేడుకలు!!

Allu arjun wife Allu Sneha Reddy Birthday Pics Goes Viral

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా అల్లు స్నేహారెడ్డికి ఉండే ఫాలోయింగ్, క్రేజ్ చిన్నదేమీ కాదు. బన్నీ ప్రేమ, పెళ్లి అన్నీ అందరికీ తెలిసినవే. ఇక వీరిద్దరు జంటగా ఎక్కడైనా కనిపిస్తే చాలు కెమెరా కళ్లన్నీ పెద్దవి అవుతాయి. మెన్నా మధ్య నిహారిక నిశ్చితార్థంలో వీరిద్దరు ఇచ్చిన పోజులు, ఫోటో షూట్లు నేషనల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అయ్యాయి. అదీ ఈ జంటకు ఉన్న క్రేజ్. అయితే అల్లు స్నేహారెడ్డి మామూలుగా అయితే హోమ్లీ డ్రెస్సులనే ధరిస్తుంది.

 Allu arjun wife Allu Sneha Reddy Birthday Pics Goes Viral

Allu arjun wife Allu Sneha Reddy Birthday Pics Goes Viral

అప్పుడప్పుడు పార్టీలకు వెళ్లే సమయంలో వాటికి తగ్గట్టు డ్రెస్సులను ధరిస్తుంది. మెగా అల్లు ఈవెంట్లలో సంప్రదాయబద్దంగానే కనిపిస్తోంది. అల్లు స్నేహా తన ఫ్రెండ్స్ పార్టీల్లో మాత్రం దుమ్ములేపుతుంది. అక్కడ మాత్రం కొంచెం హాట్‌గా కనిపించేందుకే ట్రై చేస్తుంది. తాజాగా అల్లు స్నేహారెడ్డి బర్తే డే వేడుకలు జరిగినట్టున్నాయి.

నిన్న రాత్రి జరిగిన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను తాజాగా షేర్ చేసింది. ఇందులో అల్లు స్నేహాను చూసిన వారెవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. హాట్ డ్రెస్సులో అదరగొట్టి.. స్టార్ హీరోయిన్లు కూడా ఏ మాత్రం పనికిరారేమో అన్నట్టు పరోక్షంగా చెప్పినట్టు కనిపిస్తోంది. ఇక ఈ వేడుకల్లో బన్నీ, స్నేహ కలిసి కేక్ కట్ చేయగా… స్నేహా తన స్నేహితురాళ్లతో ఫోటోలకు బాగానే పోజులిచ్చింది.