అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఈ లాక్ డౌన్‌లో అల్లు శిరీష్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒక్కడే క్వారంటైన్ అయ్యి కష్టాలు పడ్డాడు. లాక్ డౌన్‌లో ఇంట్లో ఒక్కడే ఉంటూ.. టైం పాస్ చేసేందుకు ఓటీటీలో సినిమాలు చూస్తూ కాలక్షేపం చేశాడు. అదే సమయంలో నెటిజన్లతో చిట్ చాట్ చేసేవాడు. కొందరికీ కౌంటర్లు వేసేవాడు. నెట్ ఫ్లిక్స్ అకౌంట్ డీటైల్స్ అడిగిన వారికి కౌంటర్లు వేయడం బాగా వైరల్ అయింది.
అల్లు శిరీష్ డ్యాన్స్ క్లాసులు పెట్టినట్టు అల్లు పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాడు. అల్లు అర్హ, అల్లు అయాన్‌లకు డ్యాన్సులు నేర్పిస్తున్న వీడియోలు బాగానే వైరల్ అయ్యాయి. ఈ మధ్యే అల్లు శిరీష్ చేసిన ఓ పోస్ట్ బాగా వైరల్ అయింది. తన కళ్లద్దాలు ఎప్పుడో పోయాయని, మళ్లీ కనిపించాయని తెలిపాడు. అది కూడా తేజస్వీ దగ్గర నుంచి కొట్టేశానని, అలాంటి మోడల్స్ కోసం ప్రయత్నించాను కానీ దొరకలేదని చెప్పుకొచ్చాడు.
తాజాగా అల్లు శిరీష్ ఓ పోస్ట్ చేశాడు. తాను ఎంత బుద్దిమంతుడో చెప్పకనే చెప్పేశాడు. యూట్యూబ్‌లో పాఠాలు విన్న తరువాత ఇలా నోట్స్‌ను ప్రిపేర్ చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇలా చేస్తేనే నా మెదడులోకి ఎక్కువగా ఎక్కుతుందని తెలిపాడు. స్కూల్‌లో నేను ఫిజిక్స్, బయాలజీ మీద ఎంతో శ్రద్ద పెట్టాను అంటూ అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు.