తండ్రి పై కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అల్లు శిరీష్… అదే కారణమా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈయన నిర్మాణంలో వచ్చే సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటాయి. ఇక ఈయన వారసులుగా అల్లు వెంకట్ ఇప్పటికే ఇండస్ట్రీలో నిర్మాతగా స్థిరపడ్డారు.ఇక రెండవ కుమారుడు అల్లు అర్జున్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.ఇక మూడవ కుమారుడు అల్లు శిరీష్ సైతం గౌరవం అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చారు.

గౌరవం సినిమాతో ఈయన వెండితెర ఎంట్రీ చేసినప్పటికీ మొదటి సినిమాతో ప్రేక్షకులను సందడి చేయకపోవడమే కాకుండా పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన తన కుటుంబ సభ్యులతో గొడవపడి ఇల్లు వదిలి ముంబై మకాం మార్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అల్లు శిరీష్ ప్రస్తుతం ముంబైలో ఒంటరిగా నివసిస్తున్నారని సమాచారం.అయితే ఇంట్లో తన కుటుంబ సభ్యులతో గొడవ కారణంగానే ఈయన ఇల్లు వదిలి వెళ్ళినట్టు తెలుస్తుంది.

ఇండస్ట్రీలో అల్లు అరవింద్ కు ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అయితే తనకు ఇంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తనని ఒక హీరోగా ఇండస్ట్రీలో నిలబట్ట లేకపోయారని అల్లు శిరీష్ తన తండ్రితో గొడవ పడ్డారట. తన అన్నయ్యకు మంచి సపోర్ట్ ఇచ్చిన అల్లు అరవింద్ తన విషయంలో అలాంటి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారని తాను తలుచుకుంటే తనను హీరోగా నిలబెట్టడం గొప్ప విషయం కాదంటూ ఇంట్లో వారిపై గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయినట్టు వార్తలు వస్తున్నాయి.మరి అల్లు శిరీష్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.