శిరీష్ కోసం అల్లు అరవింద్ పెద్ద స్కెచ్చే వేశాడుగా.!

మెగా కాంపౌండ్ హీరోగా పరిచయమైనప్పటికీ అల్లు ఫ్యామిలీ హీరోగా అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అదే ఫ్యామిలీ హీరో అయిన శిరీష్‌కి మాత్రం ఆ తరహా స్టార్‌డమ్ దక్కడం లేదు.

సరైన హిట్టు పడితే కానీ, స్టార్‌డమ్ దక్కడం సాధ్యం కాదు. ఇటీవల ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో వచ్చాడు. బలవంతంగా హిట్ అనిపించేశారు ఈ సినిమాని. అయితే, దానికంత సీను లేదని తేల్చేశారనుకోండి.

ఇక, తాజా విషయం ఏంటంటే, ఎలాగైనా శిరీష్‌ని స్టార్ చేయాలని అల్లు అరవింద్ గట్టిగా సంకల్పించుకున్నారట. ఆ దిశగా ఆల్రెడీ ప్రయత్నాలు మొదలెట్టేశారట కూడా.

ఓ పెద్ద డైరెక్టర్ చేతిలో శిరీష్‌ని పెట్టాలని చూస్తున్నాడట. భారీ బడ్జెట్ పెట్టి అయినా సరే, శిరీష్‌ ఖాతాలో ఓ సూపర్ హిట్టు పడేయాలని భావిస్తున్నారట. అందుకోసం స్టార్ డైరెక్టర్లతో సంప్రదింపులు చేస్తున్నారనీ తెలుస్తోంది. చూడాలి మరి, శిరీష్‌తో ఆ భారీ బడ్జెట్ మూవీ తీయబోయే స్టార్ డైరెక్టర్ ఎవరో.!