మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్ ఎప్పుడో దూరం జరిగిపోయాడు. మెగాభిమానులు వేరు, అల్లు అర్జున్ ఆర్మీ వేరు.! ‘చిరంజీవిగారంటే నాకు ఎప్పటికీ అభిమానం అలాగే వుంటుంది..’ అని చెబుతుంటాడుగానీ, ‘హీరోలకి అభిమానులుండడం సహజం. నాకు మాత్రం సైన్యం వుంది’ అంటూ అల్లు అర్జున్ తన అహంకారాన్ని పలుమార్లు చాటుకున్నాడు.
అసలు విషయంలోకి వస్తే, జూనియర్ ఎన్టీయార్‌కి మద్దతుగా అల్లు అర్జున్ ఆర్మీ రంగంలోకి దిగింది. బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీయార్.. సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధం జరుగుతోంది.
బాలయ్య అభిమానులు రామ్ చరణ్‌కి మద్దతిస్తూ, జూనియర్ ఎన్టీయార్‌ని తిడుతున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఆర్మీ, జూనియర్ ఎన్టీయార్‌కి మద్దతిస్తూ, రామ్ చరణ్‌ని తిడుతోంది. ఇదీ ట్విస్ట్ అంటే. మధ్యలో రామ్ చరణ్ ఏం పాపం చేశాడని.? సైన్యం రెచ్చిపోవడం వెనుక కీలక ఆదేశాలు ఇస్తున్నదెవరబ్బా.?