అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప రూపొందుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ – సుకుమార్ లకి పుష్ప ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అందుకే ఇద్దరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు. రంగస్థలం లాంటి సినిమా తర్వాత సుకుమార్ .. అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సినిమా ప్రతీ ఒక్కరిలో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
కాగా ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా అంటే కనీసం 1
50 కోట్ల వరకు ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతకంటే తక్కువ బడ్జెట్ తో ఏ ఇండియన్ సినిమా రూపొందడం లేదు. ఇక పుష్ప సినిమా తెలుగు తో పాటు హిందీ.. తమిళం.. మలయాళం.. కన్నడ భాషల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ముఖ్యంగా సుకుమార్ – అల్లు అర్జున్ లకి పుష్ప సినిమా బాలీవుడ్ ఎంట్రీకి చాలా కీలకంగా మారింది. ఈ సినిమాతో హిందీలో బ్లాక్ బస్టర్ కొడితే అక్కడ స్ట్రైట్ సినిమా చేయాలన్నది ప్లాన్. అందుకే ప్రతీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అయితే ఇప్పుడు అందరూ పుష్ప బడ్జెట్ సినిమా చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. ముందు నుంచి మహా అయితే ఈ సినిమాకి కేటాయించిన బడ్జెట్ 120 కోట్ల లోపే అనుకున్నారట. కాని ఇపుడు అటు ఇటుగా 200 కోట్ల వరకు అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 40 కోట్లు కాగా సుకుమార్ రెమ్యూనరేషన్ 25 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమా భారీగా వసూళ్ళు రాబడితే లాభాలలో వాటాలను కూడా తీసుకుంటారట. ఈ విషయం పక్కన పెడితే పుష్ప సినిమా బడ్జెట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 200 కోట్ల బడ్జెట్ తో పుష్ప సినిమా ని నిర్మిస్తున్నారంటే టాలీవుడ్ హీరోలు హడలిపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.