RRR: ఆర్ఆర్ఆర్ సినిమా పై బన్నీ క్రేజీ కామెంట్.. ట్వీట్ వైరల్..!

RRR:మూడేళ్లుగా ఎదురుచూస్తున్న జక్కన్న సినిమా ఆర్ఆర్ఆర్  ఫిలిం ముందుకు రానే వచ్చేసింది. దీంట్లో కొమరం భీం గా ఎన్టీఆర్, సీతారామరాజు గా చరణ్ అద్భుతంగా నటించారు. ఎన్టీఆర్ నటనకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు.ఎన్టీఆర్ నటన పరంగా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుంటున్నారు.నందమూరి వారసుడు ఎన్టీఆర్ తన ప్రతిభతో ఒక్కోమెట్టు ఎక్కుతూ సినీ పరిశ్రమలో టాప్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఎంత ఎత్తుకు వెళ్లిన ఒదిగి ఉన్నాడు ఎన్టీఆర్. తన నటనతో డాన్సులతో అందరిని అకట్టుకున్నాడు. ప్రతి సినిమాలోనూ తన నటన ప్రతిభతో సీనియర్ నటులతో పోటీపడుతూ అభిమానులను సంతోషపెడుతున్నాడు.

ఇక తాజాగా సినిమా చూసిన చాలామంది సెలబ్రిటీలు వారి స్పందనను తెలియచేస్తున్నారు. దీనిలో బన్నీ చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకు బన్నీ తనదైన రీతిలో విషెస్ చెబుతూ ఆయా సినిమాలకు తనదైన ప్రమోషన్స్ చేస్తుంటాడు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించిన బన్నీ సినిమాలోని ఎన్టీఆర్ చరణ్ ల నటన గురించి స్పందించారు.

తారక్-బన్నీ ప్రేమగా ఒకరినొకరు ‘బావా’ అని పిలుచుకుంటారు. ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’లో ”బావా నువ్వు కుమ్మేశావ్.. నీ నటన చూస్తుంటే ఓ పవర్ హౌజ్‌ను చూస్తున్నట్లు అనిపించింది’ అని తారక్ పర్ఫార్మెన్స్ గురించి ట్వీట్ చేశాడు బన్నీ.ఇలా తారక్ నటన గురించి బన్నీ చేసిన కామెంట్‌ను అటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా వైరల్ చేస్తున్నారు.