బన్నీ “పుష్ప” రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే ?

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ త్వరలో తన అభిమానులను థియేటర్లలో కలవబోతున్నాడు. తన పుష్ప సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించాడు. సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. రష్మికా మందన్న హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ ఏడాది ఆగస్టు 13న పుష్ప సినిమా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని బన్నీ ట్విటర్ ద్వారా తెలిపాడు.ఈ ఏడాది ఆగస్టు 13 నుంచి పుష్ప సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఈ ఏడాది మిమ్మల్నందరినీ థియేటర్లలో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌తో కలిసి మరోసారి మేజిక్ చేస్తానని ఆశిస్తున్నా అంటూ బన్నీ ట్వీట్ చేశాడు.

గుబులు గడ్డంతో డీ గ్లామర్ అవతారంలో ఉన్న స్టైలిష్ స్టార్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో బన్నీకి జోడిగా రష్మిక మందన్నా ఓ గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. అల్లు అర్జున్ , సుకుమార్ , దేవిశ్రీప్రసాద్ కలయికలో ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత వస్తున్న పుష్ప పై మంచి అంచనాలే ఉన్నాయి.