Allu Arjun: 100 రూపాయల నోటుపై అల్లు అర్జున్ ఫోటో…. పిచ్చి పరాకాష్టకు చేరటం అంటే ఇదేనేమో?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను ఏకంగా ఆయనకు నేషనల్ అవార్డు కూడా వరించింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ తదుపరి ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారునే సందేహం అందరిలోనూ ఉంది. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఈయన తదుపరి సినిమాని ప్రకటించారు. కానీ ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని ఇటీవల నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో నటించబోతున్నారంటూ కూడా వార్తలు వినిపించాయి.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న బన్నీ తదుపరి సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమా పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయనకు సపరేట్ ఆర్మీ కూడా ఉందని చెప్పాలి. ఈ ఆర్మీ అల్లు అర్జున్ ఎక్కడికో తీసుకెళ్లాలని ప్రయత్నంలో భాగంగా కొన్నిసార్లు పిచ్చి పనులు చేస్తూ భారీ విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు.

తాజాగా తమ అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకోవడం కోసం బన్నీ ఫాన్స్ చేసిన ఓ పిచ్చి పని తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణం అవుతుంది. సాధారణంగా కరెన్సీ నోట్లపై గాంధీ తాత ముఖచిత్రం మనకు కనబడుతుంది. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం 100 నోట్లపై అల్లు అర్జున్ ముఖ చిత్రాన్ని క్రియేట్ చేస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఎంతోమంది తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.