నార్త్‌లో సత్తా చాటుతున్న సౌత్ హీరో.. ఇండియా టుడే ఇంగ్లీష్ కవర్ పేజ్‌పై బన్నీ ఫోటో..!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన అల్లు అర్జున్ ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అయినప్పటికీ అతని రూపం వల్ల ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా అన్ని భాషలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా ఫేమస్ అయ్యాడు.

ముఖ్యంగా పుష్ప సినిమా నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ లుక్ పై విమర్శలు చేసిన వారు ఇప్పుడు అల్లు అర్జున్ ను చూసి షాక్ అవుతున్నారు. అప్పుడు అల్లు అర్జున్ ని విమర్శించిన వారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. తాజాగా ఇండియా టుడే ఇంగ్లీష్ పత్రికలో అల్లు అర్జున్ ని పొగుడుతూ ఆర్టికల్ వచ్చింది. నార్త్‌లో సత్తా చాటుతున్న సౌత్ హీరో అంటూ ఇండియా టుడే కవర్ పేజ్ పై అల్లు అర్జున్ ఫోటో వేసి ప్రశంసలు కురిపిస్తూ ఆర్ఠికల్ వచ్చింది.

పుష్ప సినిమా మ్యూజిక్ ఆల్బమ్ కూడా ఇటీవల అన్ని భాషల్లో కలిపి 5 బిలియన్ వ్యూస్ సంపాదించింది. రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు కొల్లగొట్టింది. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో సుకుమార్ పుష్ప సినిమా సీక్వెల్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తొందర్లోనే పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ప్రస్తుతం కొందరు సౌత్ ఇండియన్ హీరోలు నార్త్ లో మంచి గుర్తింపు పొందారు. బాహుబలి ద్వారా ప్రభాస్, కెజీఫ్ ద్వారా యశ్, ఆర్ఆర్ఆర్ ద్వారా ఎన్టీఆర్, రామ్ చరణ్, పుష్ప ద్వారా అల్లు అర్జున్ ఇలా సౌత్ హీరోలు నార్త్ ఇండస్ట్రీని ఏలుతున్నారు. .