Allu Arjun: బన్నీ పుష్ప పార్ట్ 2 కోసం భారీ ఆఫర్ ను రామ్ కు వదిలేసాడా?

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుండి వచ్చినా తనకంటూ సొంత గుర్తింపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బన్నీ సినిమాలు హిందీ అనువాదంలో కూడా ఆదరణ పొందాయి. ఇటీవల వచ్చిన అలావైకుంఠపురములో సినిమా నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక పుష్ప పుట్టించిన సునామి అంత ఇంత కాదు. పుష్ప సినిమా తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీలో కూడా సత్తా చాటింది.

పుష్ప మనియా ఎంతలా ఉందంటే సెలబ్రిటీలు కూడా పుష్ప లో బన్నీ మ్యానరిజం ను అనుకరించి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ కూడా పుష్ప తగ్గేదేలే మ్యానరిజంను అనుకరించి పుష్ప ఫీవర్ ఎంతుందో తెలిసిపోయింది. ఇక పుష్ప పార్ట్ 2 సినిమా కోసం బన్నీ ప్రిపేర్ అవుతున్నాడు. సుకుమార్ పుష్ప పార్ట్ 2 సినిమా కోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 మీద అంచనాలు పెరగడంతో సుక్కు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడే పుష్ప పార్ట్ 2 షూటింగ్ ప్రారంభించారు సుకుమార్.

ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం బన్నీ ఒక భారీ సినిమా ప్రాజెక్ట్ కోసం వదులుకున్నాడని సమాచారం. బన్నీ ఎప్పడో చేయాలనీ సైన్ చేసిన వేణు శ్రీరామ్ సినిమా ఐకాన్ దిల్ రాజు నిర్మించాలనుకున్నారు. పుష్ప పార్ట్ 1 తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాల్సింది.కానీ పుష్ప పార్ట్ 2 కోసం బన్నీ బిజీగా ఉండటంతో ఈ సినిమా ను వదులుకున్నాడు. అయితే ఐకాన్ సినిమాను ఇపుడు పోతినేని రామ్ తో చేయాలనీ వేణు శ్రీ రామ్, దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కథా, కథనంలో రామ్ కోసం తగిన మార్పులు చేయాలనీ దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

పుష్ప” చేస్తున్న సమయంలో.. బన్నీ లైకా ప్రొడక్షన్స్ లో ఓ భారీ సినిమా తో పాటు “ఐకాన్” సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బోయపాటి దర్శకత్వంలో కూడా బన్నీ చేయడానికి రెడీ అయినట్లు మీడియాలో న్యూస్ వైరల్ కావడం జరిగింది. కానీ బన్నీ “పుష్ప” మొదటి భాగం భారీ రేంజ్ లో హిట్ కావడంతో సెకండ్ పార్ట్.. అదే స్థాయిలో విజయం సాధించాలని మిగతా ప్రాజెక్టులన్నీ పక్కనపెట్టి… పుష్ప పార్ట్2 పైన దృష్టి పెట్టినట్లు సమాచారం. దీంతో ఐకాన్ ప్రాజెక్టును వదులుకున్నట్లు తెలుస్తుంది . రెండో భాగం లో అల్లుఅర్జున్ ఎర్రచందనం వ్యాపారానికి సంబంధించి మాఫియా లీడర్ గా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మరింత అలరించే రీతిలో సుకుమార్ స్టోరీ లో మార్పులు చేశారు దీంతో “ఐకాన్” సినిమాని పుష్ప.. షూటింగ్ కోసం వదిలేసుకున్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.