Allu Arjun: మామూలుగా ఒక హీరో లేదా హీరోయిన్ కి ఫ్యాన్ అయ్యారు అంటే వారు సినిమాల్లో నటించే విధానం ఐనా నచ్చి ఉండాలి, లేదంటే వారి స్టైల్ నచ్చి ఉండాలి. అదే కాదు అంటే నిజ జీవితంలో ఆ హీరో లేదా హీరోయిన్ క్యారెక్టర్ గురించి తెలిసి ఉండాలి. కానీ చాలా మందికి సినిమాల్లో వారు చేసే యాక్షన్, మరియు డైలాగ్, డాన్స్ లను చూసి మాత్రం ఇష్ట పడతారు. కానీ కొందరు హీరోస్ మాత్రం రియల్ లైఫ్ లోనూ హీరోస్ గా పేరు తెచ్చుకుంటూ పలువురి ప్రసంశలు అందుకుంటున్నారు.
అలాంటి నటుల్లో ఒకరు మన ఒకప్పుడు స్టైలిస్ట్ స్టార్, ఇప్పుడు ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్. ఎక్కడికెళ్లినా సింప్లిసిటని మెయింటైన్ చేసే ఈ స్టార్ హీరోకి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఉన్నారు. అది కేవలం పుష్ప ది రైజింగ్ అనే సినిమాతోనే అని అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన ప్రేమిస్తే ప్రాణం ఇస్తాడు అనే టాగ్ ను సొంతం చేసుకున్నాడు అంటేనే తెలుస్తుంది ఈ యంగ్ హీరో క్యారెక్టర్. ఇక ఇతని సింప్లిసిటీ గురించి చెప్పాలంటే, చాలానే ఉంటాయి. అభిమానుల మధ్య తిరగడానికి, రోడ్డు పక్కన టిఫిన్ చేయడానికి బన్నీ ఎప్పుడూ వెనుకాడడు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తన మేనేజర్ మనోజ్ పెళ్లి వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. సడెన్ గా ఇచ్చిన బన్నీ సర్ప్రైజ్ తో వారు ఎంతో సంతోషం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మామూలుగా ప్రముఖుల దగ్గర పని చేసే వారి ఇండ్లల్లో ఏమైనా ఈవెంట్స్ జరిగితే వారు వారు వెళ్లడానికి కొంత మంది ఆలోచిస్తారు. కానీ అలాంటి అంత పెద్ద స్టార్ ఐనా కూడా ఆ ఫీలింగ్ ఏం లేకుండా అలా మెరేజ్ కి అటెండ్ అవడం చూసి ఫ్యాన్స్ ఆయన్ని గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవి చూసిన అభిమానులు బన్నీ ఎంతో గొప్ప వ్యక్తి అంటూ కొనియాడుతున్నారు.