సాధారణంగా ఒక సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసిన తర్వాత ఆ సినిమాలో ఒక హీరోని ఊహించుకొని అనంతరం కొన్ని పరిస్థితుల కారణంగా మరొక హీరో నటించాల్సి ఉంటుంది. ఇలా ఎంతో మంది హీరోలు కొన్ని డిజాస్టర్ సినిమాల నుంచి తప్పించుకోగా,మరి కొంతమంది హీరోలు బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా మిస్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా గురించి అందరికీ తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలో రచయితగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వక్కంతం వంశీ మొదటిసారిగా ఆయన స్వీయ దర్శకత్వంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాకు దర్శకత్వం వహించారు.ఇక ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేస్తున్న తర్వాత ఈ సినిమాలో తారక్ నటించాలని భావించారట అయితే కొన్ని కారణాలవల్ల ఈ సినిమాకు తారక్ దూరం కావడంతో ఈ స్క్రిప్ట్ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది.
ఈ క్రమంలోనే తారక్ బదులు అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించారని తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రచయిత కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తెలియజేశారు. ఇక తనకు రచయితగా కిక్ సినిమా ఎంతో మంచి పేరు తీసుకువచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోని ఈయన అల్లు అర్జున్ నటించిన ఈ సినిమా గురించి చెప్పడంతో ఇలాంటి డిజాస్టర్ సినిమా నుంచి తారక్ తప్పించుకొని లక్కీ హీరో అయ్యారని లేకపోతే తన ఖాతాలో మరొక డిజాస్టర్ ఉండేది అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.