అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో.. వైరల్ అవుతున్న బాలీవుడ్ హీరో కామెంట్స్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా పుష్ప సినిమాతో నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమా ద్వారా ఈయన నటనతో బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను సైతం ఫిదా చేశారని చెప్పాలి.ఇలా పుష్ప సినిమాతో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రెటీలు కూడా ఈయనకు అభిమానులుగా మారిపోయారు.ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ అల్లు అర్జున్ తో నటించాలని వారి మనసులో కోరిక బయట పెట్టగా మరి కొంతమంది అల్లు అర్జున్ నటించిన తరహ పాత్రలలో నటించాలని ఉంది అంటూ కామెంట్లు చేశారు.తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న టైగర్ ఫ్రాష్ సోషల్ మీడియా వేదికగా తన ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అంటూ తెలియజేశారు.

టైగర్ ఫ్రాష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ ఆస్క్ మీ అంటూ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నేటిజన్స్ ఈయనని వివిధ రకాల ప్రశ్నలు అడగగా ఒక నెటిజన్ మాత్రం సౌత్ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈయన ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అంటూ అల్లు అర్జున్ పేరు చెప్పడంతో బన్నీ ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పోస్టును టైగర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.