పుష్ప 2 సినిమా రెండు రోజుల్లోనే 449 కోట్ల భారీ కలెక్షన్ సాధించి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సినిమా అంత పెద్ద హిట్ అయినందుకు మూవీ యూనిట్ హైదరాబాదులోని ఒక స్టార్ హోటల్లో సక్సెస్ ప్రెస్ మీట్ పెట్టింది. అయితే ప్రీమియర్ రోజు సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వెళ్లడంతో అక్కడ ఒక మహిళ చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.
ఆ సంఘటన గురించి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ తన స్పందన తెలియజేస్తూ మేము పుష్ప 2 ప్రీమియర్ షో కి సంధ్య థియేటర్ కి వెళ్ళినప్పుడు తొక్కిసలాటలో కొందరికి దెబ్బలు తగిలాయని తరువాత తెలిసింది. ఇద్దరు పిల్లల తల్లి రేవతి గారు చనిపోయారని తెలియగానే చిత్ర బృందం అంతా షాక్ కి గురయ్యాము. ఊహించని ఈ ఘటన మమ్మల్ని ఎంతగానో బాధించింది. రెస్పాండ్ అవుదామన్నా సైకలాజికల్ గా టైం పట్టింది.
ఒక మనిషి చనిపోవడంతో సుకుమార్, నేను షాక్ అయ్యాము, మా ఎనర్జీ అంతా పోయింది. కోలుకోవడానికి రెండు రోజులు పట్టింది. నిజానికి థియేటర్ కు వెళ్లి అభిమానులతో సినిమా చూడ్డం అనేది 20 ఏళ్ల నుంచి నాకు అలవాటే కానీ ఇలా ఎప్పుడు జరగలేదు. ప్రేక్షకులు ఎంజాయ్ చే థియేటర్ వద్ద అలా జరగడం చాలా బాధగా ఉంది. రేవతి గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.యటం కోసం మేము సినిమాలు చేస్తుంటాం అలాంటిది
వాళ్లకి జరిగిన లాస్ ని ఎప్పటికీ మేము పోర్చలేము కానీ వారి కుటుంబానికి 25 లక్షల సాయం ఇవ్వాలని నిర్ణయించుకున్నాము, అంతేకాకుండా వాళ్ళ బాబుకి చికిత్స ఖర్చులు కూడా భరిస్తాము వారి కుటుంబానికి నేనున్నాను అని చెప్పిన అల్లు అర్జున్ మీకు వినోదాన్ని పంచాలనేదే మా ప్రయత్నం. సినిమాలు చూసేందుకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండండి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళండి అని తన అభిమానులకి సలహా కూడా ఇచ్చాడు.