ప్రైడ్ : టాలీవుడ్ నుంచి మరో అరుదైన ఘనత అందుకున్న అల్లు అర్జున్.!

Pushpa_AlluArjun_FB_171221_1200

ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ తనంత తాను తెచ్చుకున్న ఏకైక హీరో అందులోని తెలుగు హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకి గాను తాను లేటెస్ట్ గా నేషనల్ అవార్డు కూడా అందుకొని చరిత్ర సృష్టించగా బన్నీ పేరు మరోసారి పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఇక ఇదిలా ఉండగా సడెన్ గా నిన్న రాత్రి అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ నుంచి అయితే ఓ స్టేటస్ పెట్టడం వైరల్ గా మారింది. ఈరోజు ఉదయం 9 గంటలకి ఒక స్పెషల్ అప్డేట్ వస్తుంది అంటూ హింట్ ఇచ్చాడు. మరి ఈ అప్డేట్ ఇపుడు రివీల్ అయ్యింది.

కాగా ఇందులో అయితే అల్లు అర్జున్ వరల్డ్ పాపులర్ సోషల్ మీడియా సంస్థ అయినటువంటి ఇన్స్టాగ్రామ్ అల్లు అర్జున్ తో మొట్టమొదటిసారిగా తమ పార్ట్నర్ గా కొలాబరేట్ అయ్యారు. అయితే ఇండియా వైడ్ గా ఇలా అతి తక్కువ మందే ఇన్స్టాగ్రామ్ తో కొలాబరేట్ కాగా అందులో టాలీవుడ్ నుంచి అయితే మొట్ట మొదటి హీరోగా అల్లు అర్జున్ ఇప్పుడు నిలిచి మరో రేర్ ఫీట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

దీనితో పాటుగా ఇన్స్టాగ్రామ్ వారు కూడా అల్లు అర్జున్ ని ఈరోజు నుంచి ఫాలో అవ్వడం స్టార్ట్ చేయడం మరింత క్రేజీ థింగ్ గా మారింది. ఇక దీని తర్వాత అల్లు అర్జున్ కూడా తన లైఫ్ కోసం అలానే సినిమా కోసం కూడా రికార్డు చేసి పెట్టిన ఫస్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారుతుంది. దీనితో అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడు గ్లోబల్ గా కూడా ఇంకో లెవెల్ కి వెళ్లనున్నారు అని చెప్పాల్సిందే.