తన ఫస్ట్ లవ్ పేరు చెప్పిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొన్నటి వరకు ఈ మూవీ షూటింగ్ రంపచోడవరం ఫారెస్ట్ లో జరిగింది. తాజాగా హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే పనిలో బన్నీ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆహాలో ఇండియన్ ఐడల్ తెలుగు సింగింగ్ రియాలిటీ షోకి గెస్ట్ గా అల్లు అర్జున్ వెళ్ళారు.

ఈ సందర్భంగా షోలో శృతి అనే అమ్మాయి పాట పాడింది. ఆ సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత మీరు పాడిన పాట, మీ వాయిస్ చాలా బాగుంది. అలాగే మీ పేరు కూడా బాగుంది. నా ఫస్ట్ లవ్ పేరు కూడా శృతి. మీరు పాడుతూ ఉంటే ఆమె గుర్తుకొచ్చిందని రివీల్ చేశారు. ఇప్పుడు బన్నీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిన్న వయస్సు నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఉంది. తరువాత అది ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకున్నారు. అయితే అందరూ ఇప్పటి వరకు స్నేహారెడ్డి బన్నీ ఫస్ట్ లవ్ అని భావించారు. కాని తన ఫస్ట్ లవ్ పేరు శృతి అంటూ షోలో చెప్పడంతో ఒక్కసారి అందరూ షాక్ అయ్యారు.

ఏది ఏమైనా స్నేహారెడ్డి కాకుండా తాను మరో అమ్మాయిని ప్రేమించ అని లక్షల మంది చూసే షోలో చెప్పడం నిజంగా ప్రత్యేకం అని చెప్పాలి. ఇదిలా ఉంటే బన్నీ పుష్ప మూవీ కంప్లీట్ చేసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. అయితే ఇది రెగ్యులర్ జోనర్ లో కాకుండా మైథలాజికల్ కాన్సెప్ట్ తో ఉంటుందంట.

అలాగే అది కంప్లీట్ అయిన తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో టి-సిరీస్ లో పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ జరిగింది. భారీ బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది.