ఆ మధ్య మనం లాక్డౌన్లో ఎన్నో కథలు, కథనాలు విన్నాం. చూశాం. తండ్రిని సైకిల్ మీద ఎక్కించుకుని కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించిన కూతురు.. కాలి నడకన కొన్ని రాష్ట్రాలను దాటుకుంటూ స్వగ్రామానికి చేరిన వలస కార్మికులు.. తండ్రి చివరి చూపు కోసం రాష్ట్రాలను దాటుకుంటూ వందల కిలోమీటర్లు నడిచిన కొడుకు కథలు చదివారం. అయితే తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఓ అభిమాని గొప్ప సాహసం చేశాడు.
తెలుగు హీరో అయినప్పటికీ బన్నీకి దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. అయితే తాజాగా ఓ అభిమాని మాత్రం బన్నీని కలుసుకునేందుకు పాదయాత్ర చేశాడు. 5 రోజుల పాటు ఏకధాటిగా మాచర్ల నుంచి నడుస్తూ హైద్రాబాద్‌కు చేరుకున్నాడు. గంగోత్రి సినిమా నుంచి అల్లు అర్జున్‌కు పెద్ద అభిమానిని, గతంలో నాలుగైదు సార్లు బన్నీని కలవడానికి చాలా ప్రయత్నించినా కూడా కుదర్లేదు..అందుకే ఈ సారి ఏకంగా 250 కిలోమీటర్లు నడుస్తూ వచ్చాను అని తెలిపాడు.
అయితే బన్నీ కనికరిస్తాడో లేదో చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు బన్నీ కనికరిస్తూ.. మిగతా అభిమానులు కూడా అలా చేసే అవకాశం ఉంది. అందరూ ఇదే బాటను ఎంచుకుని పాదయాత్ర చేబడితే ఎలా అన్ని బన్నీ ఆలోచిస్తున్నాడేమో. మరి బన్నీ సదరు అభిమాని కోరికను తీరుస్తాడా? లేదా? అన్నది చూడాలి. బన్నీ ప్రస్తుతం పుష్ప సినిమా చిత్రీకరణ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్యాన్ ఇండియన్ లెవెలో ఉండబోతోంది.
This Man P.Nageshwar Rao was walking from Macherla to Hyderabad for meet his favourite actor @alluarjun. He started on 17th & reached Banjara hills on 22nd. Despite of many trails he never meet his favourite star..So he just did a padyayathra of 250 KM #incrediblefans @SKNonline pic.twitter.com/gYQt70483L
— Agasthya Kantu (@agasthyakantu) September 22, 2020