Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా వివాదంలో చిక్కుకున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్దకు చేరుకోవడంతో అక్కడ అభిమానులు భారీగా రావడంతో తొక్కిసులాట జరిగింది. ఇందులో భాగంగా రేవతి అనే అభిమాని మరణించడమే కాకుండా ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఇక ఈ విషయంపై పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు అయితే ఈయనని అరెస్టు చేసిన అనంతరం హైకోర్టు తనకు మద్యంతర బెయిలు మంజూరు చేసింది. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నటువంటి ఈయనపై ఎన్నో ఆరోపణలు వివాదాలు వచ్చాయి కొంత మంది ఇంటిపై దాడి కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా నేడు ఈయనకు పోలీస్ విచారణ సందర్భంగా నోటీసులు వెల్లడించారు దీంతో ఈయన నేడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.
ఇక అల్లు అర్జున్ విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్కు వెళుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మీడియా ఆయన ఇంటి వద్ద ఉన్నారు అలాగే పోలీసు బందోబస్తు కూడా భారీగా నిర్వహించారు ఇక అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ కి వెళ్లే ముందు తన భార్య కూతురికి ఎంతో ధైర్యం చెప్పి వెళ్లారు. ఇక అక్కడే అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక ఈ విచారణలో భాగంగా పోలీసులు అల్లు అర్జున్ ని ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది..
ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణకు వెళుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందనే విషయంపై అభిమానులు కూడా ఎంతో ఆత్రుత కనపరుస్తున్నారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకోనున్నారు.