Allu Arha: మరోసారి అదిరే స్టెప్పులతో ట్రెండింగ్‌లో అల్లు అర్హ…..

Allu Arha: హీరో లేదా హీరోయిన్ పాపులర్ అయితే అటోమేటిక్‌గా వారి పిల్లలు కూడా పాపులర్ అవడం చూస్తూనే ఉంటాం. అలాంటి వాళ్లలో నందమూరి ఫ్యామిలీ, సూపర్ స్టార్ క్రిష్ణ వారి వారసులు తమ తల్లిదండ్రులకున్న క్రేజ్‌తో, వారి పిల్లలు కూడా ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో ఒకరు మెగా ఫ్యామిలీ. అందులోనూ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన క్యూట్ క్యూట్ అల్లరితో, అందంగా ఉండే ఆ చిన్నారి ఇప్పటికే టాలీవుడ్‌లో నాన్నకు తగ్గ తనయ అని అనిపించుకొని , తనకంటూ ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకుంది. అల వైకుంఠపురంలో ఓ మై గాడ్ డాడీ అనే సాంగ్‌తో చిన్న చిన్న స్టెప్పులు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. దాంతో ఆ పాటకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.

ఇక తన క్యూట్ లుక్స్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో , అల్లరి చేస్తున్న వీడియోలు, పిక్స్‌తో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపించే అల్లు అర్హ కొద్ది కాలంలోనే ఎంతో పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించిన ఈవెంట్లలోనూ అక్కడక్కడా కనిపిస్తూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తూ, సందడి చేస్తోంది ఈ చిన్నారి.

ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్హకు సంబంధించిన మరో అప్‌డేట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన స్కూల్ ఫంక్షన్‌లో డ్యాన్సులు వేస్తూ అందర్నీ ఆకట్టుకుంది. దీంతో డాడీస్ క్యూట్ గాళ్ అల్లు అర్హ అనే ట్యాగ్‌ ఇచ్చి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక టాలీవుడ్‌లో మరికొద్ది రోజుల్లోనే వెండితెరపై కనిపించబోతున్న విషయం తెలిసిందే. కాగా ప్రెస్టీజియస్‌ మూవీగా తెరకెక్కనున్న శాకుంతలం అనే సినిమాలో ఈ చిన్నారి నటిస్తుండడంతో అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బ్యూటీ సమంత లీడ్ రోల్‌లో నటిస్తున్న విషయం విధితమే.