టాలీవుడ్ నుంచి అయితే పాన్ ఇండియా సినిమా లెవెల్లో తన సొంతంగా పాన్ ఇండియా క్రేజ్ ని తెచ్చుకున్న ఏకైక హీరో ఎవరైనా ఉన్నారు అంటే.. అది నిర్మొహమాటంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పొచ్చు. తన పుష్ప 1 తో సెన్సేషనల్ సక్సెస్ ని అందుకున్న తాను..
ఇపుడు పుష్ప 2 తో అయితే ఏకంగా 1000 కోట్ల మార్క్ కి గేటు తెరవనున్నాడు అని ఇప్పుడు నుంచే ఫిక్స్ అయ్యిపోయింది. కాగా ఇందుకు తగ్గట్టుగానే దర్శకుడు సుకుమార్ కూడా భారీ లెవెల్లో పుష్ప 2 ని ప్లాన్ చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం పుష్ప సక్సెస్ అనంతరం చాలా సెలెక్టెడ్ గా మారిపోయాడు.
చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటూ వెళ్తుండగా ఇపుడు తన లైనప్ ఓ రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అని చెప్పాలి. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో ఓ సినిమా లాక్ చేసుకోగా దీని తర్వాత దర్శకుడు అట్లీని కూడా లైనప్ లో పెట్టాడు. ఇది రీసెంట్ గానే ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ కాగా ఇప్పుడు మరో సెన్సేషనల్ న్యూస్ వైరల్ గా మారింది.
తమిళ్ లో అట్లీ తో పాటుగా మరో భారీ సక్సెస్ కొట్టిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తో కూడా అల్లు అర్జున్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. నెల్సన్ కూడా చాలా రోజులు నుంచి అల్లు అర్జున్ తో టచ్ లో ఉండగా ఈ సినిమా కూడా దాదాపు ఖరారు అనే వినిపిస్తుంది. దీనితో మాత్రం అల్లు అర్జున్ మామూలు ప్లానింగ్ లో లేడనే చెప్పాలి.