గండిపేట ప్రాంతంలో కొత్త ప్రాపర్టీ కొన్న అల్లు అర్జున్..దాని విలువ ఎన్ని కోట్లో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు రామలింగయ్య వారసులిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ నిర్మాతగా మారి మంచి గుర్తింపు పొందాడు ఆ తర్వాత ఆయన వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇలా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు పొందిన అల్లు అర్జున్ ఆదాయం కూడా భారీగానే ఉంది. అల్లు అర్జున్ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు కూడపెట్టుకున్నాడు.

ఇక ఇటీవల హైదరాబాద్లోని గండిపేటలో 10 ఎకరాల విస్తీర్ణంలో అల్లు కుటుంబం ఒక కొత్త స్టూడియోని నిర్మించింది. ఇటీవల నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఈ స్టూడియో అక్టోబర్ 1 న అల్లు రామలింగయ్య 100 వ జయంతి సందర్భంగా అల్లు స్టూడియోస్ ని ప్రారంభించనున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఇక అల్లు స్టూడియో సమీపంలోనే అల్లు అర్జున్ ఇటీవల కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా అల్లు అర్జున్ కొనుగోలు చేసిన ఆ ఆస్తి విలువ దాదాపు రూ. 40 కోట్ల పైనే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనే విషయం మాత్రం తెలియటం లేదు. ఇదిలా ఉండగా..ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తొందర్లోనే అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ప్రారంభించనున్న అల్లు స్టూడియోలో అదే రోజు పుష్ప2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి.పుష్ప 2 సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.