Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో క్షణక్షణానికి సరికొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పుష్ప2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ తో పాటు మరికొంతమంది వీఐపీలు అక్కడికి రావడంతో వారిని చూడటం కోసం అభిమానులు హంగామా చేశారు దీంతో తొక్కిసలాట జరగగా రేవతి అనే మహిళ అభిమాని మరణించారు.
ఇలా అభిమాని మరణించడం పట్ల అల్లు అర్జున్ స్పందిస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు. కానీ ఈయనపై కేసు నమోదు అయింది అది కూడా నాన్ బెయిల్ కేసు నమోదు కావడంతో అల్లు అర్జున్ పై పోలీసులు చర్యలు తీసుకొని ఆయనని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేసే ప్రస్తుతం ఈయనని కోర్టులో హాజరు పరిచారు.
ఇక ఈయనపై నాన్ బెయిల్ కేసు నమోదు కావడంతో ఈయనకు బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్ విధిస్తారా అనే విషయంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మరొక సంచలనమైనటువంటి ట్విస్ట్ చోటుచేసుకుంది. అల్లు అర్జున్ పై కేసు పెట్టిన రేవతి భర్త వెనకడుగు వేశారు. తాను ఈ కేసు విత్ డ్రా చేసుకుంటానని ఈయన చెప్పడంతో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
తన భార్య చనిపోయిన ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఏ మాత్రం లేదని తెలిపారు. అవసరమైతే నేను ఈ కేసును విత్డ్రా చేసుకుంటానని ఈయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ ను విడుదల చేయాలని ఈయన కోరారు. అల్లు అర్జున్ తో పాటు ఆరోజు చాలామంది విఐపిలు, సెలబ్రిటీలు థియేటర్ వద్దకు వచ్చారని ఈయన వెల్లడించారు. ఇలా ఈ కొంత గ్యాప్ లోనే రేవతి భర్త నిర్ణయం మార్చుకోవడం వెనుక కారణం ఏంటని పలువురు భావిస్తున్నారు.
అల్లు అర్జున్ అరెస్టు చేసే వరకు ఈయన మౌనంగా ఉండి అరెస్టు చేసిన తర్వాత కేసు విత్ డ్రా చేసుకోవడం వెనుక కారణమేంటి ఈయనపై ఏ రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందా అందుకే కేసు పెట్టారా ఇప్పుడు ఉన్నఫలంగా కేసు విత్ డ్రా చేసుకోవడానికి కారణం ఏంటి అనే కోణంలో అభిమానులు నేటిజన్స్ ఆలోచిస్తున్నారు. ఇక ఈయనకు భారీ మొత్తంలో డబ్బు ముట్టిందని అందుకే ఇలా కేసు విత్ డ్రా చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ కూడా మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.