Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సమయంలో సంధ్య థియేటర్లో తొక్కిసలాటలో భాగంగా అభిమాని రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే .ఈ విషయంలో అల్లు అర్జున్ పై కూడా కేసులు నమోదు అయితే తాజాగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఇలా ఈయనని అరెస్టు చేసిన పోలీసులు ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే ఇక ఈ విషయంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.