Allu Arjun: అల్లు అర్జున్ అరెస్ట్… పవన్ సంచలన ట్వీట్.. విడిపోతే పడిపోతాం అంటూ?

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు కావడంతో ఎంతో మంది రాజకీయ నాయకులు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ప్రీమియర్ షో కారణంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు అయితే అదే థియేటర్ కి అల్లు అర్జున్ వెళ్లడంతో తొక్కిసలాట జరిగి ఒక మహిళ అభిమాని మృతి చెందింది అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం సరి కాదంటూ ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు అలాగే రాజకీయ నాయకులు అల్లు అర్జున్ కు మద్దతు తెలుపుతున్నారు.

ఈ ఘటన తర్వాత తెలంగాణ సర్కార్ ప్రీమియర్ షోల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ప్రీమియర్ షోలకు అనుమతి తెలుపకూడదంటూ ఓ నిర్ణయానికి వచ్చారు. ఇలాంటి తరుణంలోని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ మరోసారి పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అనే విధంగా వివాదాన్ని సృష్టించిదని చెప్పాలి.

ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో ఈయన అరెస్టు గురించి కానీ అల్లు అర్జున్ గురించి గానీ ఎక్కడ ప్రస్తావించక పోయినా సోషల్ మీడియా వేదికగా కలిసి ఉంటే నిలబడతాం…విడిపోతే పడిపోతాం అంటూ ఒక కొటేషన్ షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కాస్త సంచలనంగా మారింది. కొంతమంది కరెక్ట్ టైం కి పోస్ట్ చేశారు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు ఈయన పోస్ట్ పట్ల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తన పవర్ ఏంటో నిరూపించుకోవడం కోసమే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారని అల్లు అర్జున్ అరెస్టు వెనుక పవన్ ప్రమేయం కూడా ఉండవచ్చు అంటూ మరికొందరు బన్నీ ఫాన్స్ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ అరెస్ట్ మరోసారి పొలిటికల్ వార్ కి కారణమైందని చెప్పాలి.