ఆ మార్పుల్ని పక్కన పెట్టిన అల్లు అర్జున్, సుకుమార్.!

‘పుష్ప 2 ది రూల్’ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తయిపోతోందిట.! ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు అనుకున్న విధంగానే సినిమాని విడుదల చేయాలని అనుకుంటున్నారట దర్శక నిర్మాతలు. హీరో అల్లు అర్జున్ నుంచి సంపూర్ణ సహాయకారాలు అందితే, దర్శకుడి పని తేలికైపోతుంది.

కానీ, ‘పుష్ప 2 ది రూల్’ అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ‘పుష్ప ది రైజ్’ విషయంలో వీఎఫ్ఎక్స్ చాలా విమర్శల్ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే, ‘పుష్ప 2 ది రూల్’ వీఎఫ్ఎక్స్ విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ వర్క్ సాఫీగానే జరుగుతోందిట.

అయితే, సినిమాకి సంబంధించి ముందు అనుకున్నదానికంటే, అదనంగా కొన్ని సీన్స్ రాసుకున్నాడట దర్శకుడు సుకుమార్. ఈ విషయమై అల్లు అర్జున్ కూడా సానుకూలంగానే వున్నాడు.

అయితే, ఆ స్పెషల్ సీన్స్ తీయాల్సి వస్తే, అదనంగా టైమ్ తినేస్తుందన్న కోణంలో దర్శకుడు, హీరో, నిర్మాణ సంస్థ.. అందరూ కలిసి కూర్చుని చర్చించుకుని, ఆ వ్యవహారాన్ని కాస్త పక్కన పెట్టారని తెలుస్తోంది.

ఏమాత్రం టైమ్ వున్నా, అలా పక్కన పెట్టేయాలనుకున్న సీన్స్‌ని షూట్ చేయాలనే ఆలోచనలోనే టీమ్ వుందట. ఏమో, ఏమైనా జరగొచ్చు. అనుకున్న సమయానికి సినిమా విడుదల చేసే పరిస్థితి లేకపోతే, తప్పనిసరి పరిస్థితుల్లో వాయిదా పడాల్సి వస్తే.. మార్పులుంటాయట.