Allu Arjun: వివాదాల నడుమ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించిన జనసేన నేత.. ఆకాశమే నీ హద్దు అంటూ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వివాదంలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా మహిళా అభిమాని మరణించడంతో అల్లు అర్జున్ అరెస్ట్ అనే విషయం తెలిసిందే.ఇలా ఈయనకు కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది కానీ అనంతరం మధ్యంతర బెయిలు మీద అల్లు అర్జున్ బయటకు వచ్చారు. ఇలా అల్లు అర్జున్ అరెస్ట్ కావడం ఇటు ఇండస్ట్రీలోనూ అటు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైంది.

ఇలా అల్లు అర్జున్ వివాదాలలో నిలిచిన సమయంలో జనసేన నేత బొల్లి శెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా తన అభిమాని మరణించడమే కాకుండా ఆమె కుమారుడు శ్రీ తేజ్ గాయాల పాలతో ఆసుపత్రిలో అడ్మిట్ కావడంతో అల్లు అర్జున్ స్పందించారు రేవతి కుటుంబానికి తాను అండగా నిలుస్తానని తెలిపారు. అలాగే బాబు వైద్య ఖర్చులను తానే భరిస్తానని అల్లు అర్జున్ తెలిపారు.

తాను వెళ్లి శ్రీ తేజ్ ను పరామర్శించాలని కోరుకుంటున్నాను కానీ లాయర్లు కేసు కోర్టులో ఉన్న నేపథ్యంలో వెళ్లవద్దని చెప్పారు. త్వరలోనే తనని కలుస్తానని అల్లు అర్జున్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు అయితే ఈయన చేసిన ఈ పోస్ట్ పట్ల బొల్లి శెట్టి సత్యనారాయణ స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈయన అల్లు అర్జున్ గురించి పోస్ట్ చేస్తూ..అర్జున్ గారు ఆ యాక్సిడెంట్ లో ఇబ్బంది పడిన కుటుంబాన్ని బాధ్యతగా తీసుకోండి.

మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది మీరు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది ఆకాశమే మీ హద్దు. జనాలను మీరు ఇన్స్పైర్ చేయండి వారు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లండి అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక తాను విశాఖపట్నంలో ఉన్న మీ తాత గారి స్నేహితులలో ఒకరినని అంటూ ఆయన కామెంట్ చేశారు. అంతేకాకుండా ఈ ట్వీట్లో జనసేనను పవన్ కళ్యాణ్ ను కూడా ట్యాగ్ చేయడం గమనార్హం.