ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషలలో డిసెంబర్ 5న పుష్ప 2 గ్రాండ్ రిలీజ్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా పలుచోట్ల ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తూ బిజీగా ఉన్నారు మూవీ టీం. ఈ క్రమంలోనే హైదరాబాదులో కూడా డిసెంబర్ 2న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాదులోని యూసఫ్ గూడా లో పోలీస్ గ్రౌండ్ లో జరిగిన ఈవెంట్ కి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ ఈవెంట్ లో మూవీ టీం తో పాటు అల్లు అరవింద్ కూడా జాయిన్ అయ్యారు
ఆయన సభలో మాట్లాడుతూ తన పుత్రోత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ కొద్దిరోజుల క్రిందట పుష్ప 2 సినిమా చూడటం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత వెలిగిపోతున్న నా మొహాన్ని చూసి ఏం జరిగింది అని అడిగిందంట ఆయన భార్య. అల్లు అరవింద్ పుష్ప 2 సినిమా విషయం చెప్తే మగధీర ముందు మీ మొహం అంతగా వెలిగిపోవటం చూసాను మళ్లీ ఇప్పుడు చూస్తున్నాను అని అన్నారంట.
ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ రష్మిక పుష్ప వన్ సినిమాలో చాలా తక్కువ నటించిందని చెప్పుకోవాలి, పుష్ప 2 లో అంత బాగా నటించింది. అలాగే శ్రీ లీల సినిమాలో కనిపించిన సమయం చాలా తక్కువ కానీ చూపించిన ఇంపాక్ట్ చాలా ఎక్కువ అని చెప్పారు. అల్లు అర్జున్ భార్య స్నేహ కి సుకుమార్ భార్య భభితకి ఈ సినిమాకి వచ్చిన అవార్డులన్నీ ఇవ్వాలి.
ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు వారిని అంతగా సపోర్ట్ చేసినందుకు అని చెప్పారు అల్లు అర్జున్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి కూడా మాట్లాడుతూ దేవి శ్రీ ప్రసాద్ నాకు చిన్నతనం నుంచి బాగా తెలుసు, తన తండ్రి నా స్నేహితుడు, అయితే అతను ఇంత మంచి హిట్స్ ఇవ్వడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటూ ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ని మెచ్చుకొని మూవీ టీ మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్పే తన ప్రసంగాన్ని ముగించారు అల్లు అరవింద్.