ఆ హీరోయిన్లు అవమానిస్తే అల్లరి నరేష్ నా పరువు కాపాడారు.. గీత సింగ్ కామెంట్స్?

గీతా సింగ్ తెలుగు సినిమాలలో ఎన్నో చిత్రాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన కితకితలు సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించి సందడి చేశారు.ఈ విధంగా హీరోయిన్ గా కితకితలు సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం ఎన్నో తెలుగు సినిమాలలో కమెడియన్ గా నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె పూర్తిగా వెండితెరకు దూరమయ్యారు.

ఇలా వెండితెరకు దూరమైనటువంటి గీతా సింగ్ తాజాగాఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో పురుషాధిక్యత ఎక్కువ ఉందని అందుకే మాలాంటి చిన్న చిన్న ఆర్టిస్టులకు ఏమాత్రం అవకాశాలు లేకుండా పోయాయని ఈమె తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తనకు జరిగిన అవమానం గురించి కూడా ఈమె వెల్లడించారు.ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు హీరోయిన్లు నన్ను చూసి ఆమె హీరోయిన్ ఏంటి అంటూ నా పట్ల చాలా చీప్ గా మాట్లాడారని తనను అవమానించారని గీతా సింగ్ వెల్లడించారు.

ఇలా నా గురించి ఆ హీరోయిన్లు ఇద్దరు దారుణంగా మాట్లాడుతున్న సమయంలో ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నటువంటి అల్లరి నరేష్ వారి వద్దకు వెళ్లి తను నా సినిమా ఫస్ట్ హీరోయిన్ అంటూ చెప్పడంతో ఒక్క సారిగా ఆ హీరోయిన్ల షాక్ అవ్వడమే కాకుండా అప్పటినుంచి తనని మేడం అంటూ పిలవడం మొదలు పెట్టారని గీతా సింగ్ వెల్లడించారు.ఇలా ఆ ఇద్దరు హీరోయిన్లు తనని అవమానకరంగా మాట్లాడితే తన గురించి ఎంతో గొప్పగా చెప్పి అల్లరి నరేష్ నా పరువు నిలబెట్టారంటూ గీత సింగ్ ఈ సందర్భంగా అప్పటి సంఘటన గుర్తు చేసుకున్నారు.