టాలీవుడ్ ఆశలన్నీ సీనియర్ స్టార్స్ మీదనే

టాలీవుడ్ లో విరూపాక్ష తర్వాత ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఏవీ కూడా పెద్ద సక్సెస్ కాలేదు. పాన్ ఇండియా స్థాయిలో ఆదిపురుష్ మూవీ వచ్చింది. ఈ చిత్రంపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ కూడా డిస్టిబ్యూటర్స్ కి ఆశించిన స్థాయిలో లాభాలు తీసుకురాలేదు. థియేటర్స్ కి కూడా కలిసొచ్చింది ఏమీ లేదు. ప్రస్తుతం అన్ని చిన్న సినిమాలే వస్తున్నాయి.

వీటికి ఎంత పెద్ద హిట్ అయిన భారీ కలెక్షన్స్ అయితే రావు. నెక్స్ట్ స్టేజ్ లో జులై 28న పవన్ కళ్యాణ్ బ్రో మూవీ ఉంది. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే నైజాంలో థియేటర్స్ కి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏపీలో మాత్రం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. ఏపీ బయ్యర్లు, థియేటర్ ఓనర్స్ కూడా బ్రో సినిమాపై పెద్దగా హోప్స్ పెట్టుకోలేదు.

నెక్స్ట్ ఆగష్టు 11న మెగాస్టార్ చిరంజీవి మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద మాత్రం చాలా హోప్స్ ఉన్నాయి. దీంతో మళ్ళీ థియేటర్స్ యజమానులకి ఎంతో కొంత లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. వాల్తేర్ వీరయ్యతో ఈ ఏడాది మెగాస్టార్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో బయ్యర్లు కూడా భాగా లాభపడ్డారు. థియేటర్స్ యజమానులకి కూడా కలిసొచ్చింది.

ఇక సెప్టెంబర్ లో అయితే ఖుషి, రామ్ పోతినేని, బోయపాటి మూవీ, టిల్లు స్క్వేర్, సలార్ సినిమాలు ఉన్నాయి. వీటన్నింటి మీద చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే సలార్ చిత్రంపై ఎక్కువ హోప్స్ ఉన్నాయి. తరువాత దసరా ఫెస్టివల్ సీజన్ లో బాలయ్య భగవత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఉన్నాయి. ఇవి కూడా బయ్యర్లకి మంచి లాభాలు తెచ్చిపెడతాయని ఆశిస్తున్నారు.

ఇలా టాలీవుడ్ లో డిస్టిబ్యూటర్స్ నుంచి థియేటర్స్ యజమానుల వరకు అందరూ సెప్టెంబర్, అక్టోబర్ నెలలపైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. ఆ రెండు నెలలు కచ్చితంగా బ్లాక్ బస్టర్ పడటంద్వారా తమకి ఫైనాన్సియల్ గా ప్లస్ అవుతాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.