కీర్తి సురేష్ హిందీ మార్కెట్ లోకి ఆల్ సెట్..!

ఇప్పుడు మన ఇండియన్ సినిమా దగ్గర ఒక ఇండస్ట్రీ కి చెందిన వ్యక్తులు మరో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో కలిసి సినిమాలు చేస్తుండడం చాలా సాధారణంగా అయితే మారిపోయింది. మరి అలా హీరోలు దర్శకులు వర్క్ చేస్తుండగా పలువురు సౌత్ హీరోయిన్స్ కూడా వర్క్ చేసారు.

అలా ఆల్రెడీ బాలీవుడ్ మార్కెట్ కి వెళ్లి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వారిలో ఇప్పుడు అయితే తమన్నా బాగా సెటిల్ అయ్యింది. ఇక ఈమె తర్వాత అయితే రష్మిక మందన్నా కూడా వెళ్ళింది కానీ ఆమెకి అంత సక్సెస్ అయితే దక్కలేదు. ఇక వీరి తర్వాత ఇప్పుడు మరో టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇపుడు హిందీలో మార్కెట్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది.

కాగా ఈమె అయితే హిందీలో హీరో వరుణ్ ధావన్ తో చేయనున్న సినిమాతో పరిచయం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతే కాకుండా ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ నిర్మాణం వహించనుండడం విశేషం. ఇక ఈ చిత్రం అయితే అట్లీ సినిమాల్లోనే ఒకటి రీమేక్ గా చేస్తున్నారని అందులో కీర్తి నటిస్తున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఆ సినిమా ఏంటి అనేది చూడాలి. ఇక ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగు సహా తమిళ్ లో కూడా పలు చిత్రాలు చేస్తుండగా దర్శకుడు అట్లీ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో భారీ చిత్రం “జవాన్” చేసాడు. ఈ చిత్రం ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కాబోతుంది.