ఇన్సైడ్ రిపోర్ట్స్ అన్నీ సలారోడికే..!

ఇప్పుడు రానున్న మరికొన్ని రోజుల్లో అయితే మళ్ళీ ఇండియన్ సినిమా దగ్గర ఒక బాక్సాఫీస్ బ్లాస్ట్ జరగనుంది. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆ మోస్ట్ అవైటెడ్ సినిమా “సలార్ సీజ్ ఫైర్” అయితే ఎట్టకేలకు థియేటర్స్ లో దిగబోతుండగా ఎనలేని హైప్ దీనిపై ఉంది.

ఇక ఈ మాసివ్ ప్రాజెక్ట్ పట్ల ఇప్పుడు సినీ వర్గాల్లో ఎందుకో ఓ టాక్ అయితే గట్టిగా ఊపందుకుంది. అటు హిందీ సహా తెలుగు లో కూడా సినీ ట్రాకర్స్ సలార్ సినిమాకి సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ అందిస్తున్నారు. హిందీలో షారుఖ్ సినిమా ఉన్నప్పటికీ సలార్ కే పెద్ద ఎత్తున పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని అలాగే కంటెంట్ పరంగా కూడా సలార్ చిత్రందే పై చేయి అని అంటున్నారు.

అయితే ఇంతే కాకుండా సలార్ చిత్రంలో మొత్తం 5 ఏక్షన్ సీక్వెన్స్ లు ఉంటే అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయని అంటున్నారు. అలాగే సినిమాలో మేజర్ రోల్ అయితే ఇందులో ఎమోషన్స్ అని ప్రభాస్ కూడా కన్ఫర్మ్ చేయగా ఇది నిజమే అని ఇన్సైడ్ రిపోర్ట్స్ కూడా అంటున్నారు.

మరి సలార్ సినిమాకి ప్రభాస్ కి పృథ్వీ రాజ్ మధ్య కాంబినేషన్ ఫ్రెండ్షిప్ సీన్స్ కానీ ఆ ఎమోషన్స్ కానీ చాలా బాగా వచ్చాయని అంటున్నారు. ఇలా మొత్తానికి అయితే ఇన్సైడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా “సలార్” సినిమాకే మొగ్గు చూపుతున్నాయి. మరి చూడాలి ఈ డిసెంబర్ 22న ఏమవుతుందో అనేది.