త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న అలీ కుమార్తె.. ఘనంగా నిశ్చితార్థం వైరల్ అవుతున్న వీడియో!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు కమెడియన్ అలీ. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రారంభమైన తన సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కథ ప్రాధాన్యత ఉన్న సినిమా అవకాశాలు కనుక వస్తే తప్పకుండా సినిమాలలో నటిస్తానని ఈయన తెలిపారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో కూడా సందడి చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా అలీ ఇంట శుభకార్యం జరిగినట్టు తెలుస్తుంది. అలికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు అనే విషయం మనకు తెలిసిందే.అయితే అలీ పెద్ద కుమార్తె ఫాతిమా ఇదివరకే డాక్టర్ కోర్స్ పూర్తి చేసే ఈమె డాక్టర్ గా స్థిరపడ్డారు. అయితే త్వరలోనే అలీ కుమార్తె ఫాతిమా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆగస్టు 25వ తేదీ హైదరాబాద్లోని కోహినూరులో వీరి నిచ్చితార్ధాన్ని అలీ ఎంతో ఘనంగా జరిపించారు. ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు సందడి చేశారు.

ఇకపోతే అలికి కాబోయే అల్లుడు పేరు షేక్ షహాయాజ్. అయితే ఈయన ఏం చేస్తారు ఏంటి అనే విషయం తెలియకపోవడంతో అభిమానులు తన అల్లుడు గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నిశ్చితార్థం ఘనంగా జరుపుకోవాలని ఎంతోమంది సెలబ్రిటీలు ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చి కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని అలీ భార్య జుబేదా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఈ వీడియో, ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసిన ఎంతోమంది అభిమానులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.