ఆ హీరోయిన్ కంటే యూట్యూబ్ స్టార్స్ నయం.. ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారు!

సాధారణంగా సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మందిని టాలెంట్ ఉన్న నటి నటులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ క్రమంలోనే వారిలో ఉన్న టాలెంట్ సోషల్ మీడియా ద్వారా బయట పెడుతూ ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకుంటారు. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలియాభట్ సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోలింగ్ కి గురైంది. అసలు ఈమె గురించి నెటిజెన్స్ ట్రోల్ చేయడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…

అలియా భట్ తాజాగా తన స్నేహితురాలు అనుష్క రంజన్ పెళ్లిలో భాగంగా గర్ల్స్ గ్యాంగ్ తో కలిసి రాణి ముఖర్జీ నటించిన చల్కా చాల్కా రే అనే పాటకు స్టెప్పులు వేశారు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇందులో ఆలియాభట్ ఎంతో నిరుత్సాహంగా గాగ్రా చోళీ ధరించి డాన్స్ వేస్తూ కనిపించింది.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఈ డాన్స్ పై స్పందిస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు.

ఈ హీరోయిన్ కన్న ఎంతో మంది యూట్యూబ్ స్టార్స్, ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా వేసే డాన్సులు ఎంతో అద్భుతంగా ఉంటాయని ఈమెను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. ఈమె చేస్తున్న డాన్స్ లో గ్రేస్ లేదు, ఈ పాటకు వారి డాన్స్ కు సింక్ కావడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అలియా భట్ విషయానికి వస్తే ఈమె మొట్టమొదటి సారిగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.